![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -291 లో...జ్యోత్స్నకి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. నాకు జ్యోత్స్న చూడగానే నచ్చిందని అబ్బాయి అనగానే నీకు అలా చూడగనే నచ్చితే చిన్నప్పటి నుండి నా బావే ప్రాణం అనుకుంటున్నా.. బావ ఎంత నచ్చాలని జ్యోత్స్న అంటుంది. అతనికి పెళ్లి అయింది అంట కదా అని అతను అంటాడు. అతనికి అన్ని విషయలు చెప్పి తీసుకొని వచ్చానని శివన్నారాయణ అంటాడు.
అంటే ఇప్పటికి నా మనసులో నా బావ ఉన్నాడు. కార్తీక్ నా పక్కన ఉన్నాడని ఊహించుకొని పడుకుంటాననగానే శివన్నారాయణ కోప్పడతాడు. దాంతో అబ్బాయి వెళ్ళిపోతు.. మా తాతయ్యకి నాకే అమ్మాయి ఇష్టం లేదని చెప్తానని వెళ్ళిపోతాడు. కార్తీక్ నే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న మూర్ఖంగా మాట్లాడుతుంటే.. సుమిత్ర కోప్పడుతుంది. అయిన మనం ఏం చెయ్యలేం.. అలాంటి కూతురుని కన్నందుకు బాధపడడం తప్ప అని దశరథ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీప, శౌర్యలు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే.. ఆటో రిపేర్ వస్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నేను మీ రెస్టారెంట్ కోసం చాలా హెల్ప్ చేసానని శౌర్యతో జ్యోత్స్న చెప్తుంది. అవునా చాలా థాంక్స్ అని శౌర్య అంటుంది. పదండి నా కార్ లో వెళదామని జ్యోత్స్న అనగానే.. శౌర్య వెళ్లి కార్ ఎక్కుతుంది. దాంతో దీప కూడా కార్ ఎక్కుతుంది.
రెస్టారెంట్ లో కస్టమర్స్ వస్తున్నారంటూ కాంచనతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తాడు. అప్పుడే జ్యోత్స్న వాళ్ళు వస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ జ్యోత్స్న.. ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసి చెప్పిందని కాంచన అంటుంది. బావనే నా భర్త అని జ్యోత్స్న అంటుంటే.. కార్తీక్ కి కోపం వస్తుంది. కాంచన మాత్రం ముందు వెనకాల ఆలోచించకుండా జ్యోత్స్న ని తిడుతుంది. వచ్చావ్ కదా మా రెస్టారెంట్ లో కస్టమర్స్ పెరగడానికి ఒకరకంగా నువ్వు కూడా కారణం కదా అందుకే స్వీట్ తీసుకోమని కార్తీక్ అంటాడు. దీప స్వీట్ తీసుకొని జ్యోత్స్నకి ఇస్తుంది. దీప చేసింది కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటి ఉందని కార్తీక్ అనగానే జ్యోత్స్న కి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |